UTF LEADERS ARREST: విజయవాడలో ఉపాధ్యాయుల నిరసనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సీపీఎస్ రద్దు, పీఫ్ ఖాతాల్లో రూ.1826 కోట్లు బకాయిలు తిరిగి జమ చేయాలంటూ విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నాకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది. ధర్నా చౌక్‌లో నిరసన తెలిపేందుకు ఉపాధ్యాయులు వేసిన టెంట్‌ను పోలీసులు తీసేశారు. నిరసనలో పాల్గొనేందుకు వస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి.. సింగ్ నగర్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల అక్రమ అరెస్టులపై ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడ్డారు. మూడేళ్లలో ఉద్యోగులకు ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలీసుల అక్రమ అరెస్టులను యూటీఎఫ్ నేతల తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన చేయడం కూడా నేరమా అని యూటీఎఫ్ నేతలు రామ్ జీ అంబేద్కర్, లెనిన్ బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని వారు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: