పలు జిల్లాల్లో శనివారం కురిసిన అకాల వర్షాలు అన్నదాతలకు ఆవేదన మిగిల్చాయి. ప్రకాశం జిల్లాలోని చీరాల, పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పంటలు నీటమునిగాయి. చిన్నగంజాం ప్రాంతంలో మిరప పంటలు దెబ్బతిన్నాయి. కనిగిరిలో కంది, శనగ, వరి, మినుము, ఆముదం పంటలు నేలకొరిగాయి. గుంటూరు జిల్లాలో బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలపై వరుణుడు రైతులను నిండాముంచాడు. వరి పొలాల్లోకి నీరు చేరింది. కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. చేతికొస్తాయనుకున్న వేరుసెనగ, మిరప పంటలు కళ్లెదుటే నీటిలో తేలుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా దివిసీమలో కోత దశలో ఉన్న వరి పంట దెబ్బతింది.
ఇదీ చదవండి :