కరోనా విపత్కర పరిస్థితుల్లో మృతుల అంత్యక్రియలు నిర్వహించడం భారంగా మారింది. అంత్యక్రియల నిర్వహణకు 25 వేల నుంచి 50 వేల రూపాయల మధ్య ప్యాకేజీ మాట్లాడుకుంటున్న తరుణంలో కొందరు మృతదేహాలను శ్మశానంలో వదిలి వెళ్తున్నారు. గన్నవరం శ్మశానవాటికలో తెల్లవారుజామున గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ మృతదేహన్ని వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తుండగా కరోనా భయంతోనే మృతదేహన్ని వదిలి వెళ్లారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పంచాయతీ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్న పోలీసులు..గుర్తుతెలియని మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: