కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. వీరపనేనిగూడెంలోని బ్యాంకు నుంచి ఇంటికి వెళ్తున్న మహిళకు లిఫ్ట్ ఇచ్చిన యువకులు... మార్గమధ్యంలో వాహనాన్ని నిలిపి బలవంతంగా పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వెంటనే బాధితురాలు ఆత్కూరు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆత్కూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మహిళపై అత్యాచారం.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు - తెంపల్లిలో మహిళపై అత్యాచారం
మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో జరిగింది. ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.