Students Missing In Kankipadu: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని కంకిపాడు జడ్పీ పాఠశాలలో (Kankipadu ZP School) ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం కలకలం రేపుతోంది. పాఠశాలలో చదువుతున్న 9వ తరగతికి చెదిన విద్యార్థినులు (students missing) సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండాపోయారు. విద్యార్థులను అదే గ్రామానికి చెందిన గుండి జోజి అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదృశ్యమైన విద్యార్థుల్లోని ఒక విద్యార్థిని ఇంటి పక్కనే జోజి నివసిస్తున్నాడు.
విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు (Police) విచారణ చేపట్టారు. జోజి కోసం పోలీసులు వాకబు చేయగా.. అతను సోమవారం మధ్యాహ్నం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జన శతాబ్ది ట్రైన్లో (Shatabdi Train) చెన్నై వైపు వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి విద్యార్థినుల కోసం గాలిస్తున్నారు.
ఇవీ చూడండి
ఇవీ చూడండి