కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో కాలువ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం రెండు పార్టీల వరకూ వెళ్లింది. రోడ్డుపైన ఒక వర్గానికి చెందిన కుటుంబీకులు వివాహితపై దాడి చేశారు. ఇంటి ముందు మురుగునీరు వెళ్లడానికి వీలు లేకుండా కాలువ తవ్వారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా బెదిరిస్తున్నారని వాపోయారు.
తమ సంతకాలు లేకుండానే పంచాయతీ రోడ్డు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని.. అలా చేస్తే ఎప్పటికీ తమ మురుగు నీరు సమస్య పరిష్కారం కాదని బాధితులు తెలిపారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి రోడ్డు నిర్మాణ పనులు ఆపించాలని చెప్పినా వైకాపా నాయకులు అండ చూసుకుని కొందరు వ్యక్తులు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికే తనపై దాడి చేశారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఖరికి పోలీసులు సైతం తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని.. దాడి చేసిన వ్యక్తులను వదిలేసి తమనే కేసులు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన చెందారు. అధికారులు తమకు న్యాయం చెయ్యాలని.. ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చూడండి..
కరోనా ఉద్ధృతి పెరిగింది.. డిగ్రీ, వృత్తి విద్య పరీక్షలు రద్దు చేయండి: పవన్