కృష్ణా జిల్లా విజయవాడ నగర శివారు పాయికాపురం నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్లే కూడలిలో వాహనదారుల ఇబ్బందిపై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి గుంతలమయమైంది. ఇటీవల కాలంలో ఈ గోతుల వల్ల.. ప్రమాదాలు జరిగాయి. వాహనాలు అదుపుతప్పి మరమ్మతులకు గురయ్యాయి.
సమస్యపై.. అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సీఐ బాలరాజు స్పందించారు. సిబ్బందితో కలిసి స్వయంగా వారే రోడ్లపై భారీ గోతులను పూడ్చారు. వాహనదారులకు అసౌకర్యాన్ని తొలగించారు.. నిత్యం ట్రాఫిక్ చలానా తో వాహనదారులను బెంబేలెత్తించే ట్రాఫిక్ పోలీసులు రహదారులను మరమ్మతు చేయడంపై స్థానికులు వాహనచోదకులు ఆనందం వ్యక్తం చేశారు. అభినందించారు.
ఇదీ చూడండి: