కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు అంబేడ్కర్ నగర్ కాలనీలో 15రోజుల వ్యవధిలో ఓ యువతిని పాము మూడుసార్లు కాటువేసింది. కాలనీలో నివాసం ఉంటున్న ఏసమ్మ పెద్ద కుమార్తె సంధ్యను పాము కాటేయగా..ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. కోలుకున్న అనంతరం ఇంటికి తీసుకురాగా.. కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు మళ్లీ పాముకాటుకు గురైంది. చికిత్స పొందిన ఇంటికి వచ్చిన మరుసటి రోజే మూడోసారి పాము కరిచింది. ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు, కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్నారు. పాము ఇంటి సమీపంలోకి రాకుండా ఇంటి చుట్టూ వలను కట్టారు. కాలనీలోని ప్రజలంతా రేయి పగలు ఆ ఇంటికి కాపలాగా ఉంటున్నారు.
ఇదీ చూడండి. నాణ్యమైన ఉద్యోగాలు కల్పిస్తే భారీ ప్రోత్సాహకాలు: మంత్రి గౌతమ్ రెడ్డి