కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి వార్షిక చిన్న తిరునాళ్లు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి... అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అఖండజ్యోతి స్థాపించడంతో తిరునాళ్లను అధికారికంగా ప్రారంభించారు.
తొలిరోజే భక్తులు ఆలయానికి పోటెత్తారు. మహిళలు పొంగళ్ళు చేసి అమ్మవారికి సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడింది. ఎగ్జిబిషన్ ప్రాంగణం, మున్నేరు పరిసర ప్రాంతాల్లో భక్తుల కోలాహలం కనిపించింది. తిరునాళ్లకు వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా తాగునీరు, వసతి ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా... పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుకలు ప్రారంభం