విజయవాడ గ్రామీణం నున్న గ్రామంలోని వికాస్ కళాశాల రోడ్డులో గృహిణి మెడలో గొలుసును దొంగలు లాక్కెళ్లారు. ద్విచక్రవాహహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు అద్దె ఇళ్లు కోసం వెళ్లి..దొంగతనానికి పాల్పడ్డారు. మదునూరు దాక్షణ్య అనే గృహిణి మెడలో ముడున్నర కాసుల బంగారాన్ని లాక్కెళ్లిపోయారు. ఇటీవల కాలంలో నగరంలొ ఇదే తరహా గొలుసు దొంగతానాలు జరుగుతుండటంతో ..పోలీస్ ఉన్నతాధికారులు సంఘటనా స్ధలంలోని సీసీ కెమారాలను పరిశీలించారు.. ఏడీసీ సీసీఎస్ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ షఫ్రుధ్దీన్, శ్రీనివాసరావు పలువురు నేర పరిశోదన అధికారులు పరిశీలించి బాధితురాలి వాగ్మూలం నమోదు చేశారు.
ఇదీ చూడండి. ప్రజారోగ్యం దృష్ట్యా ఇప్పట్లో ఎన్నికలు పెట్టలేం : కొడాలి నాని