Visakha steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్త శుద్ధి ఉన్నా ఎన్ఎండీసీ, సెయిల్ తో ఈవోఐ దాఖలు చేయించి, టెండర్లు వేయించాలని ఉక్కుపోరాట సమితి డిమాండ్ చేసింది. జేఎస్పీ, జేఎస్పీడబ్ల్యూ వంటి సంస్థలతో అంగీకారం కుదుర్చుకోవాలనుకుంటే ఆందోళన తప్పదని స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు కర్మాగారం ఈఓఐ ముగిసే సమయానికి 29 సంస్థలు తమ ఆసక్తిని వ్యక్తం చేశాయని కార్మిక సంఘాల నేతలు వివరించారు. స్టీల్ ప్లాంట్ ఈవోఐ లో తెలంగాణ సింగరేణి సంస్థ పాల్గొనలేదని వెల్లడించారు. ఆరు వీదేశీ సంస్థలు కూడా ఈవోఐ దాఖలు చేశాయని, వాళ్లకు అప్పగిస్తే అభ్యంతరం లేదని వివరించారు. సింగరేణి కోల్ కంటే తాల్చేరులో ఉన్న మహానది కోల్ ధర తక్కువని, విశాఖ స్టీల్ కు రోజుకు ఒక ర్యాకు(గూడ్స్ రైలు) కోకింగ్ కోల్ అవసరమని తెలిపారు. మహానది కోల్ ఫీల్డ్ తో అగ్రిమెంట్ వున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం రైల్వే ర్యాకు ఇవ్వకుండా అడ్డుకుంటోందని విమర్శించారు
విశాఖ పరిశ్రమకు ముడి సరుకు కొరత ఉంది.. కానీ, ఆ బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది. ఆ మేరకు యాజమాన్యం ఆహ్వానించిన ఈవోఐ గడువు ఈ నెల 15న ముగిసింది. మరో ఐదు రోజులు గడువు పెంచడంతో మొత్తం 29 బిడ్లు వచ్చాయి. ఇందులో విదేశీ సంస్థలకు చెందినవి ఏడు ఉన్నాయి. ఈ నెలాఖరు కల్లా టెండర్ ఖరారు కావచ్చు. మే నెలలో టెండర్ ప్రకటన కూడా ఉంటుంది. కార్మిక సంఘం నాయకులుగా మేం కోరినట్లు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ లో పాల్గొనలేదు. తెలంగాణ రాష్ట్రం తరఫున వచ్చిన సింగరేణి సంస్థ కూడా.. ఐదు రోజులు గడువు పెంచినా టెండర్ వేయలేదు. అయితే, విదేశీ సంస్థల నుంచి 3, 4వేల కోట్లు తీసుకుని ఏడాది లోపు చెల్లించవచ్చు. వాళ్లు ఇక్కడి ఫ్యాక్టరీకి ఎలాంటి హాని తలపెట్టలేరు. - అయోధ్యరామ్, స్టీల్ ప్లాంట్ కార్మిక నేత
ఆసక్తి చూపని తెలుగు రాష్ట్రాలు... విదేశీ సంస్థలు సైతం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ దరఖాస్తు గడువు ముగియగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపించలేదు. తెలంగాణ తరఫున.. ఆ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సింగరేణికి ఐదు రోజులు గడువు ఇచ్చినా ఈవోఐ బిడ్ దాఖలు కాలేదు. మొత్తం 29 సంస్థలు టెండర్ దరఖాస్తు చేశాయని, అందులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఎండీసీ లాంటి సంస్థలు పాల్గొనలేదని కార్మిక సంఘ నేత అయోధ్య రామ్ తెలిపారు. విదేశీ సంస్థలు పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం ఉండబోదని.. ఏడాదిలో పెట్టుబడికి తగ్గ స్టీల్ సరఫరా చేసే వీలుంటుందని అన్నారు. మన బ్రాండ్ ఇమేజ్ కి దెబ్బలేకుండా.. ఆ మేరకు స్టీల్ వారికి సరఫరా చేసే ఒప్పందం వల్ల విశాఖ ఉక్కుకు ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.
ఇవి చదవండి :