ETV Bharat / state

రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ ఉందా..? సీఎం నివాసం దగ్గరలో ఘాతుకాలు జరిగినా మౌనమేనా? : పవన్‌

author img

By

Published : Feb 13, 2023, 6:32 PM IST

Updated : Feb 13, 2023, 7:39 PM IST

pawan comments : రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాడేపల్లిలో అంధ యువతి హత్య శాంతి భద్రతల వైఫల్యమే అని మండిపడ్డారు.

Etv Bharat
Etv Bharat

pawan comments : తాడేపల్లిలో అంధ యువతి హత్య శాంతిభద్రతల వైఫల్యమే అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ ఉందా..? సీఎం నివాసం దగ్గరలో ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని అని ప్రశ్నించారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయి అమ్మకాలకు అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన రేప్‌ కేసులో నిందితుడిని ఇంకా పట్టుకోలేదని, తన నివాసం పరిసరాల పరిస్థితులనే సమీక్షించకుంటే ఎలా? అని ఆందోళన వ్యక్తం చేశారు.

మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటేనని ఎద్దేవా చేశారు. కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని పవన్ పేర్కొన్నారు. దొంగతనానికి వచ్చి రేప్ చేశారని, తల్లి పెంపకంలోనే లోపం ఉందనే మంత్రులు కలిగిన ఈ ప్రభుత్వ పాలనలో దారుణ ఘటనలపై అన్ని వర్గాలూ ఆలోచన చేయాలని సూచించారు. అఘాయిత్యాలు సాగుతుంటే మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేశారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలో అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా?.. సీఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని ప్రశ్నించారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందన్నారు. తాడేపల్లిలోనే గతంలో జరిగిన రేప్‌ కేసులో ఒక నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని విమర్శించారు.

అసలేం జరిగింది... గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్‌ కట్ట ప్రాంతంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అంధురాలైన యువతిపై అదే ప్రాంతంలో ఉంటున్న దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే లోగా ప్రాణాలు కోల్పోయింది. దాడి చేసిన వ్యక్తిని స్థానికుడు రాజుగా పోలీసులు గుర్తించారు. గంజాయి మత్తులో అతడు ఈ దాడి చేసినట్లు సమాచారం. నిన్న రాజు యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో.. ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు అతడిని మందలించారు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న అతడు.. ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

ఇవీ చదవండి :

Last Updated : Feb 13, 2023, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.