అధిక వడ్డీ ఆశ చూపి ఖాతాదారుల నుంచి కోట్లలో సొమ్ములు వసూలు చేసిన కృష్ణా జిల్లా గుడివాడ ఆదర్శ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులు ముఖం చాటేయటంతో....ఖాతాదారులు ధర్నాకు దిగారు. తాము నిరుపేదలమని రూపాయి రూపాయి పోగుచేసి అధిక వడ్డీ ఆశ చూపితే డబ్బులు కట్టామన్నారు. గడువు ముగిసినా నగదు ఇవ్వడంలో జాప్యం చేస్తూ... సరైన సమాధానం చెప్పడం లేదని ఖాతాదారులు వాపోయారు. ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా తమ చేతుల్లో ఏమీ లేదని సిబ్బంది చెప్పడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు. తాము కట్టిన డబ్బులు ఇవ్వాలని లేకుంటే సంస్థపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: అమరావతి భూములపై విచారణ... 12 మందిపై ఏసీబీ కేసు