ETV Bharat / state

కూలీల కొరత, పొలాల్లోనే పాడవుతున్న పంటలు

పత్తి తీయడానికి, మిర్చికోయడానికి కూలీలు దొరకడం లేదు. కనుచూపుమేరా పత్తి పొలాలు తెల్లటి పూలతోటల్లా కనిపిస్తున్నా... రైతులు పంటను చేజిక్కించుకోలేకపోతున్నారు. కూలీల కొరతతో పంటలు పొలాల్లోనే పాడైపోతున్నాయి. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

author img

By

Published : Feb 23, 2020, 11:38 AM IST

పొలాల్లోనే పాడైపోతున్న పంటలు
పొలాల్లోనే పాడైపోతున్న పంటలు

సాధారణంగా జనవరి మొదటి వారం నుంచే మిర్చి కోతలు ముమ్మరం అవుతాయి. అప్పటికి పత్తి తీత దాదాపుగా పూర్తవుతుంది. గతేడాది అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు తొలికాపు పత్తి దెబ్బతినడంతో పాటు తేమ ఎక్కువై మొక్కలు గిడసబారాయి. మలి కాపు ఆలస్యమైంది. ఫలితంగా పంటకాలం ముందుకు జరిగింది.

ఒకేసారి అవసరం

ఏటా డిసెంబరు, జనవరి చివరకు పూర్తయ్యే పత్తితీతలు.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కొనసాగుతున్నాయి. ఒకేసారి అటు మిర్చి కోతలు, ఇటు పత్తితీతలకు కూలీల అవసరం ఏర్పడింది. ఏటా కర్నూలు, కడప జిల్లాల నుంచి మిరప కోతలకు వందలాది మంది కూలీలు గుంటూరు, కృష్ణా జిల్లాలకు వచ్చేవారు. 20 నుంచి 30 మంది కూలీలు ఉంటే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ముందే అడ్వాన్సులు ఇచ్చి.. కూలి ధర ముందే నిర్ణయించుకుని వారిని రప్పించేవారు. రవాణా రుసుములనూ రైతులే భరించేవారు. కొన్ని గ్రామాల్లో స్థానికంగా ఉండే జనాభాకు రెట్టింపుస్థాయిలో కూలీలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. కొన్నేళ్లుగా ఆయా జిల్లాల్లోనే వేర్వేరు రకాల పంటలు సాగు చేయడం, స్థానికంగానే పని దొరుకుతుండటంతో వలస వెళ్లే కూలీల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. మిర్చి కోతలకు రోజుకు రూ.400 దాకా ఇస్తున్నా ఎవరూ దొరకడం లేదు.

ఎండలు... చర్మవ్యాధులు

  • గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని శివాపురం నుంచి 20 మందిమి రెండు నెలల కిందట వచ్చామని అమరావతి సమీపం పొలంలో పత్తి తీస్తున్న కూలీలు వివరించారు. కిలో తీసినందుకు రూ.13 చొప్పున ఇస్తున్నారని వివరించారు. ఎండలు ముదురుతున్నాయని మరో వారంలో వెళ్లి పోవాలనుకుంటున్నామని తెలిపారు.
  • కర్నూలు జిల్లాలో చివరికాపు పత్తికి గులాబీరంగు పురుగు ఆశించింది. ఆ పురుగులు చేతులపై పాకితే చర్మవ్యాధులు వస్తున్నాయనే భయం కూలీల్లో నెలకొంది. దీంతో పత్తితీతకు రావడం లేదు. ఫలితంగా ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్ల పత్తి ఇంకా పొలాల్లోనే ఉంది.
  • పత్తి తీయించడానికే క్వింటాలుకు రూ.1,800 నుంచి రూ.2 వేలు అవుతోందని మద్దూరు రైతులు వాపోయారు. క్వింటాలుకు ధర రూ.4 వేలే లభిస్తోందని చెప్పారు.

తొలకరి నుంచీ ఎదురీతే...

ఎడతెరిపిలేని వర్షాలతో ఎకరాకు 3 క్వింటాళ్ల దాకా తొలికాపు పత్తి దెబ్బతింది. అరకొరగా చేతికొచ్చినా.. తడిచిన పత్తి, గుడ్డికాయ అని ధర తగ్గించారు. తర్వాత గులాబీ రంగు పురుగు ప్రభావం మొదలై నాణ్యత తగ్గింది. క్వింటాలుకు రూ.5,550 మద్దతు ధరగా నిర్ణయించినా... ఈ-పంటలో నమోదు కాకపోవడం, వెళ్లినా తేమ, నాణ్యత పేరుతో కోత వేస్తుండటంతో ఎక్కువ మంది రైతులు ఇళ్ల దగ్గరే క్వింటాలు రూ.3,500-4,500 మధ్య విక్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యంలో 12 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగింది.

ఇదీచదవండి

68వ రోజుకు అమరావతి నిరసనలు... నేడు దీక్షలో 151 మంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.