స్మార్ట్ ఫోన్ వాడకం ,సామాజిక మాధ్యమాల్లో వ్యవహరించాల్సిన విధానాలపై సైబర్ సేఫ్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడతామని విజయవాడ సిద్ధార్ధ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ వెల్లడించారు. స్మార్ట్ఫోన్ వ్యసనం,ఫేక్ సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యాపింప చేయకుండా నిరోధించే లక్ష్యంతో తమ కళశాల ఎండ్ నౌ పౌండేషన్ అనే ఎన్జీవోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛమైన భాష ,అసభ్య సందేశాలు ,ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకుండా ఉండేందుకు తాము కృషి చేస్తామని ఎండ్ నౌ పౌండేషన్ ఛైర్మన్ అనిల్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా సిద్ధార్థ కళాశాలలో సైబర్ సేఫ్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఘనత తమకే దక్కుతుందని సిద్ధార్ధ కాలేజి ప్రిన్సిపల్ రమేష్ చెప్పారు.
ఇదీచూడండి.కశ్మీర్లో సమాచార వ్యవస్థ పునరుద్ధరణ