గోదావరి, కృష్ణా నదులపై సమస్య సమస్యాత్మక ప్రాజెక్టులతో పాటు.. అన్ని ప్రాజెక్టులను గెజిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవటం రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించటమేనని రైతు సంఘాల నాయకులు, విశ్రాంత ఇంజనీర్లు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్- పర్యవసానాలపై ఆంధప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో చర్చావేదిక నిర్వహించింది.
ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్రానికి ఎటువంటి అనుభవం లేదని.. విశ్రాంత చీఫ్ ఇంజనీర్ రామకృష్ణ గుర్తుచేశారు. కేవలం ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉన్న ప్రాజెక్టల పర్యవేక్షణను మాత్రమే కేంద్రం తీసుకంటే బాగుంటుందని మరో విశ్రాంత ఇంజనీర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. 299 టీఎంసీలే తెలంగాణకు వస్తాయని గతంలో ఆ రాష్ట్ర శాసనసభలో స్వయంగా చెప్పిన కేసీఆర్ ఇప్పుడు.. 50 శాతం వాటా అడగటం ఎంటని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే కేసీఆర్ నీటి నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు మండిపడ్డారు.
ఇదీ చదవండీ.. IAS TRANSFERS: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ