ETV Bharat / state

వేసవి ఆరంభం: నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు - sun heat latest News

రాష్ట్రవ్యాప్తంగా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు జిల్లా మనుబోలులో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రత గుర్తించగా.. ఒంగోలులో అత్యల్పంగా 37.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

వేసవి ఆరంభం : నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు

author img

By

Published : Mar 30, 2021, 1:44 PM IST

వేసవి సీజన్ ఆరంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను మించినట్టు వాతావరణశాఖ వెల్లడించింది. సగటు ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగినట్టు ఐఎండీ స్పష్టం చేసింది.

నెల్లూరు నుంచి విశాఖ వరకు..

నెల్లూరు జిల్లా మనుబోలులో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. చిత్తూరు జిల్లాలో 41.3, నెల్లూరు ఉదయగిరిలో 41.1 పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు 41, ప్రకాశం జిల్లాలో 40.9, కర్నూలులో 40.9, తూర్పుగోదావరి జిల్లాలో 40.8, గుంటూరులో 40.7 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో 41.4, కడపలో 40.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక విజయవాడలోని అమరావతిలో 41.68 డిగ్రీలు, శ్రీకాకుళంలో 41.63 డిగ్రీలు, విజయనగరం తెర్లాంలో 41.5 డిగ్రీలు, అనంతపురం తాడిపత్రిలో 41.1, చిత్తూరు రేణిగుంటలో 41.1 డిగ్రీలు, విశాఖ జిల్లా రావికమతంలో 41.08 డిగ్రీలు నమోదయ్యాయి.

నగరాల్లోనూ అదే సెగ..

రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య నగరాలు విజయవాడలో 39 డిగ్రీల సెల్సియస్, విశాఖ 35 డిగ్రీలు, ఏలూరు 39.9 డిగ్రీలు, రాజమహేంద్రవరం 38 డిగ్రీలు, కాకినాడలో 34.9 డిగ్రీలు, తిరుపతిలో 38.4 డిగ్రీలు, అనంతపురంలో 39 డిగ్రీలు, కడపలో 41.2 డిగ్రీలు, కర్నూలులో 41.6 డిగ్రీలు, నెల్లూరులో 39 డిగ్రీలు, ఒంగోలులో 37.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. చాలా చోట్ల వడగాల్పుల ప్రభావం కూడా పెరుగుతుందని స్పష్టం చేసింది. పెరుగుతున్న వేడికి అనుగుణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇవీ చూడండి : విశాఖ ఉక్కుపై హైకోర్టులో ఐపీఎస్ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణ పిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.