ETV Bharat / state

'అవగాహన లేకనే ప్రజలపై భారం మోపుతున్నారు' - కళా వెంకట్రావు తాజా వార్తలు

విజయవాడలో తెదేపా నేతలు నిరసన దీక్షకు దిగారు. విద్యుత్​ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా తమ తమ ఇళ్లల్లో లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేపట్టారు. సీఎం, మంత్రులకు అవగాహన లేకనే ప్రజలపై విద్యుత్ భారం మోపారన్నారు.

elugudesham party leaders protest
కళా వెంకట్రావు నిరసన
author img

By

Published : May 21, 2020, 2:47 PM IST

పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు నిరసన దీక్షకు దిగారు. నిబంధనలు పాటిస్తూ ఎవరి ఇళ్లలో వారే దీక్షకు కూర్చున్నారు. విజయవాడ కేశినేని భవన్​లో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావ్, కేశినేని నాని, శ్వేత తదితరులు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి అవగాహన లేకే బిల్లులు పెంచిందని ఆరోపించారు.

కరోనాతో పేద ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం హేయమని కళా వెంకట్రావ్ ధ్వజమెత్తారు. ఇలాంటి సమయంలో వచ్చిన బిల్లులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత శ్లాబు విధానమే కొనసాగించాలన్నారు. లేదంటే ఇంకా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి:

కాయకు 'పండు ఈగ'... రైతుకు నష్టాల క్షోభ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.