వ్యవసాయం పట్ల ముఖ్యమంత్రిది కపట ప్రేమని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. రైతులపై నిజంగా ప్రేముంటే 50శాతం సబ్సిడీపై డీజిల్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో అన్నదాతలు ఏరువాక పండుగను కూడా చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల రైతులు అయోమయంలో ఉన్నారన్నారు. 3వేలకోట్లతో ధరలస్థిరీకరణ నిధి అని చెప్పి బడ్జెట్లో తూతూ మంత్రంగా 500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని ఎద్దేవాచేశారు. గోదావరి జిల్లాల్లో కర్షకులు మళ్లీ పంట విరామం ప్రకటించే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేల అండతో వైకాపా నేతలు, దళారులుగా మారి అన్నదాతల కష్టాన్ని దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఖరీఫ్ సాగుకు రుణాలు అందక, పంటల బీమా సొమ్ములేక అన్నదాతలు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి