ETV Bharat / state

Anandbabu ''వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరు అనుమానాస్పదం.. సీఎం జగన్ తాపత్రయం అదే'' - అవినాష్ అరెస్ట్

Nakka Anand babu వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరుపై తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు పలు సందేహాలు లేవనెత్తారు. అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా పేర్కొన్న సీబీఐ.. భాస్కర్ రెడ్డితో పాటు ఎందుకు అరెస్టు చేయకుండా తాత్సారం చేస్తోందని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఆదేశాలు పాటిస్తూ.. ఇప్పటికైనా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 24, 2023, 7:30 PM IST

Updated : Apr 24, 2023, 7:54 PM IST

Nakka Anand babu : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తీరు అనుమానాస్పదంగా కన్పిస్తోందని తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. వైఎస్ వివేకా కేసులో సీబీఐకు చిత్తశుద్ధి ఉంటే అవినాష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో అవినాష్ రెడ్డిని సీబీఐ సహ నిందితునిగా పేర్కొందని నక్కా గుర్తుచేశారు. సహ నిందితుడిగా పేర్కొన్న అవినాష్ ను అరెస్ట్ చేయకుండా విచారణకు పిలవడం ఏమిటని అని నిలదీశారు.

అవినాష్ రెడ్డికి అవకాశాలిస్తున్న సీబీఐ.. అవినాష్ రెడ్డికి విచారణ నోటీసు ఇవ్వడం ద్వారా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది సీబీఐ కాదా అని ప్రశ్నించారు. అసలు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై అప్పీలుకు వెళ్లాల్సిన సీబీఐ... ఆ పని ఎందుకు చేయలేదని మండిపడ్డారు. ఇప్పటికిప్పుడే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నక్కా ధ్వజమెత్తారు. అవినాష్ అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగితే ఏమైనా జరగొచ్చునని ఆరోపించారు. ఈ కేసులో విజయ్ కుమార్ లాంటి లాబీయిస్టులు, బ్రోకర్లు ప్రత్యక్షమవుతున్నారని తెలిపారు. సీఎం జగన్ వారితో గంటల తరబడి గడుపుతూ లండన్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారని ఆక్షేపించారు. వివేకా కేసు విచారణలో ఏమైనా జరగొచ్చనే అనుమానం వస్తోందని, ఈ అనుమానాలకు సీబీఐ తెర దించాలని కోరారు.

అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కానీ, సీబీఐ చేస్తున్న దర్యాప్తు అనుమానాస్పదంగా కనిపిస్తోంది. పులివెందులలో భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన విధంగా అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేసే వీలుంది. అవినాష్ ను సహ ముద్దాయిగా పేర్కొన్నందున... అదే పద్ధతిలో ఆయన్ను కూడా అరెస్టు చేయెచ్చు. పైగా బెయిల్ కోసం సీబీఐ అవకాశం ఇచ్చినట్టుగా అనుమానం కలుగుతోంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై సీబీఐ కాకుండా పిటిషనర్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా ప్రశ్నించింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాల మేరకు అవినాష్ ను అరెస్టు చేసే వీలుంది. కుట్ర, హత్య, ఆధారాలు చెరిపేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి.. ఆవినాష్ తప్పించుకునే అవకాశాలున్నందన ఇప్పటికిప్పుడు అరెస్టు చేయాలి. మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి తన విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుని కేసు మీద దృష్టి పెట్టాడు. తన సమయాన్నంతా కేసును దారిమళ్లించేందుకు వాడుకుంటున్నాడు. - నక్కా ఆనందబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరు అనుమానాస్పదం

ఇవీ చదవండి :

Last Updated : Apr 24, 2023, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.