కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం చినపారుపూడి ప్రాథమిక పాఠశాలలో క్లాస్ రూమ్ లోనే ఉపాధ్యాయురాలు ప్రాణాలు విడిచారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ గుండెపోటుతో మసిముక్కు శ్రీదేవి (54) మృతి చెందారు. తెలుగు ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఆమె స్కూల్ కు హాజరై విధులు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాఠశాల సిబ్బంది వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
ఇవీ చూడండి:
రాష్ట్రానికి కొవిడ్ వ్యాక్సిన్.. రెండు రోజుల పాటు టీకా ఉత్సవ్