విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ 14వ రోజు నిరసన దీక్షచేపట్టారు.కరోనా వచ్చి 4 మాసాలు గడుస్తున్న రాష్ట్ర ప్రజలను ఆర్ధికంగా ఆదుకోవడంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విజయవాడ తెదేపా అర్బన్ అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు మండిపడ్డారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటె కార్మికులను, చిరు వ్యాపారస్తుల ప్రతి కుటుంబానికి 10వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కరోనా వైరస్‌తో గత 4నెలలుగా కార్మికులకు, వ్యాపారులకు ఉపాధి ఇబ్బంది పడుతున్న వారిని ఆర్ధికంగా ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నారని దుయ్యబట్టారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. 12రకాల నిత్యావసర సరకులు ఇస్తామని ప్రచారం చేసుకున్నారే తప్ప ఆచరణలో ఇంతవరకు మాట నిలబెట్టుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తానన్న 3గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఇవ్వలేదన్నారు. ప్రతి కుటుంబానికి 10వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి