హైదరాబాద్‌తో అనుబంధం పెంచుకున్న రాయలసీమ వాసులకు.. రాజధానిని దూరం చేసిన కాంగ్రెస్‌కు పట్టిన గతే వైకాపాకు పడుతుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు హెచ్చరించారు. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలిస్తే.. అనంతపురం వాసులకు వెయ్యి కిలోమీటర్లకు పైగానే ప్రయాణించాలని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో రాజధాని మార్పు ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు సమాధి కడుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో నిర్మాణాలు కొనసాగించి ఉంటే కీలక ఘట్టాలు ఈపాటికి పూర్తి కావటంతోపాటుగా ఏటా 12 వేల కోట్ల వరకూ ఆదాయం సమకూరేదని వెల్లడించారు. సంపద సృష్టి కేంద్రమైన అమరావతిని కాపాడుకోవటం అందరి బాధ్యత అని కాలువ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...