కక్ష సాధింపు చర్యలతో ముఖ్యమంత్రి జగన్... రాష్ట్రాన్నే బలిచేస్తున్నారన్న విషయం ప్రజలకు అర్థమవుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గీతం విశ్వవిద్యాలయంపై సీఎం కన్నుపడటం దురదృష్టకరమన్న చినరాజప్ప... వర్సిటీని ప్రోత్సహించకుండా కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. న్యాయపరిధిలో ఉన్న కట్టడాలను గుట్టుచప్పుడు కాకుండా కూల్చడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీసే విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ నియంతృత్వ పోకడలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇదీచదవండి.