ETV Bharat / state

'దళితులపై దాడి కొనసాగిస్తూనే ఉంటారా?'

author img

By

Published : May 20, 2020, 10:36 AM IST

సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టు పెడితే... వృద్ధ మహిళపై కేసు నమోదు చేయడమేంటని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసిన దళిత మహిళ భాగ్యలక్ష్మిపై దాడి చేయడమేంటని ధ్వజమెత్తారు.

Tdp Polit Bureau  member Varla Ramaiah conference on ranganayakamma
వర్ల రామయ్య

వైకాపా నాయకుల తీరును తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తప్పుబట్టారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక పోస్ట్ పెడితే... వృద్ధ మహిళపై కేసు నమోదు చేయడమేమిటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేస్తే దళిత మహిళ భాగ్యలక్ష్మిపై దాడి చేయడమేమిటని ధ్వజమెత్తారు. 65 ఏళ్ల మహిళ రంగనాయకమ్మపై చూపిన పౌరుషం, వేగం.. దళిత మహిళపై దాడి చేసిన నిందితులపై ఎందుకు చూపించలేదని నిలదీశారు.

దళితులైన డాక్టర్ సుధాకర్, భాగ్యలక్ష్మిలపై దాడులు చేసిన వైకాపా నాయకులు... రేపు ఎవరి మీద దాడి చేస్తారో అని ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు దళితులపై దాడి కొనసాగిస్తూనే ఉంటారా అని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్​లో దళితుల పట్ల పూర్తిగా వ్యతిరేక భావం ఉందని విమర్శించారు.

ఇదీ చూడండి:

గ్యాస్ లీకేజీ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.