ETV Bharat / state

MP Rammohan Naidu: అక్రమ కేసులకు భయపడేదే లేదు: ఎంపీ రామ్మోహన్ నాయుడు

వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు ఎంపీ రామ్మోహన్ నాయుడు(tdp mp rammohan naidu news). మచిలీపట్నం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.

tdp
tdp
author img

By

Published : Oct 3, 2021, 6:36 PM IST

వచ్చే ఎన్నికల్లో పసుపు జెండా(TDP)ను ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు(tdp mp rammohan naidu news). వైకాపా చేసిన తప్పుడు ప్రచారంలో వెనకబడినందునే.. ఇవాళ ఇలా ప్రతిపక్షంలో ఉన్నామని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ స్థాయి పార్టీ శిక్షణా తరగతుల(machilipatnam assembly constituency) ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుర్మార్గమైన.. క్షక్షపూరితమైన పాలనను వైకాపా సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అంశాన్నే మరిచిపోయిన సీఎం జగన్.. దిల్లీ వెళ్లేందుకు భయపడుతున్నారని అన్నారు. తెదేపాను రాజకీయంగా ఎదుర్కొనలేకే తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులకు భయపడే పార్టీ తెదేపా కాదని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి తెదేపా హయాంలోనే జరిగిందన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు పార్టీ పొలిట్​బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర (kollu ravindra news). వచ్చే ఎన్నికల్లో తెదేపా (tdp)గెలుపునకు కృషి చేయాలని కోరారు. కుల, మత‌, ప్రాంతాల మ‌ధ్య చిచ్చుపెట్టి రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (cm ys jagan news)ప్రయ‌త్నిస్తున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి

భవానీపుర్​లో దీదీ విజయఢంకా- 58 వేల ఓట్ల తేడాతో గెలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.