రాష్ట్రంలో కక్షపూరిత, అరాచక పాలన జరుగుతోందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల అరెస్టులే ఇందుకు నిదర్శనమన్నారు. అసెంబ్లీలో అచ్చెన్నను ఎదుర్కొనే సత్తా లేకనే అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడి అక్రమ అరెస్ట్‌పై ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యనమల, చినరాజప్పలపై కూడా అక్రమ కేసులు బనాయించారని, సీఎం జగన్ బెదిరింపు రాజకీయాలకు త్వరలోనే ముగింపు పలుకుతుందని హెచ్చరించారు.
ఇదీచదవండి.