
కరోనా విజృంభిస్తున్న కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రారంభించాలని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ సీఎం జగన్కు లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు ట్యాబ్లు, కళాశాల విద్యార్ధులకు ల్యాప్ టాప్లు అందించాలన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు హాజరవ్వాలని ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ డిజిటల్ తరగతుల నిర్వహణను ప్రారంభించాయని తెలిపారు. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులకు తగిన సదుపాయాలు ఉచితంగా అందించి ప్రోత్సహాకాలు కల్పించాలని అనగాని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అచ్చెన్నపై కొనసాగుతున్న రెండోరోజు అనిశా విచారణ