గన్నవరం నియోజకవర్గానికి తెదేపా బాధ్యుడిగా నియమితులైన బచ్చుల అర్జునుడు.. అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తనకు ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే.. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన తాను.. 30 ఏళ్లుగా పార్టీకి విధేయుడిగా ఉన్నానన్నారు.
ఆయనతో పాటు.. నియోజకవర్గంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పర్యటించారు. వారందరికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నియోజకవర్గం.. తెదేపాకు కంచుకోట అని నారాయణ అన్నారు.
ఇదీ చదవండి: