కృష్ణాజిల్లా చందర్లపాడు మండలంలోని వరదప్రభావిత ప్రాంతాల్లో తెదేపా నాయకుల బృందం పర్యటించింది. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో పార్టీ నేతలు బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధితులను ఆదుకోవాలని రెవెన్యూ సిబ్బందికి సౌమ్య విజ్ఞప్తి చేశారు. వైద్య సదుపాయాలను, నిత్యావసర సరుకులను అందజేయాలని కోరారు. ఎటువంటి ఇబ్బంది వచ్చిన ప్రజలు రెవెన్యు అధికార్లను సంప్రదించాలని ఆమె సూచించారు.
ఇది కూడా చదవండి.