ETV Bharat / state

TDP Leaders: దేవాదాయ భూముల్ని రక్షించండి: తెదేపా - తెలుగుదేశం వార్తలు

కృష్ణా జిల్లా గుడివాడలో అన్యాక్రాంతమయ్యే దేవాదాయ భూముల్ని పరిరక్షించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దేవాదాయ కమిషనర్​కు లేఖ రాశారు. గుడివాడ శివారు పులివర్తి, యల్లయ్యపాలెం గ్రామాల పరిధిలో రూ.250కోట్లు విలువ చేసే 25ఎకరాల దేవాదాయ భూమిని కాజేసేందుకు మంత్రి కొడాలి నాని యత్నిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు.

దేవాదాయ భూముల్ని రక్షించండి
దేవాదాయ భూముల్ని రక్షించండి
author img

By

Published : Sep 29, 2021, 8:26 PM IST

కృష్ణా జిల్లా గుడివాడలో అన్యాక్రాంతమయ్యే దేవాదాయ భూముల్ని పరిరక్షించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దేవాదాయ కమిషనర్​కు లేఖ రాశారు. గుడివాడ శివారు పులివర్తి, యల్లయ్యపాలెం గ్రామాల పరిధిలో రూ.250కోట్లు విలువ చేసే 25ఎకరాల దేవాదాయ భూమిని కాజేసేందుకు మంత్రి కొడాలి నాని యత్నిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు.

అన్యాక్రాంతమయ్యే దేవాదాయ భూముల్ని కాపాడండి..

కృష్ణా జిల్లా గుడివాడలో అన్యాక్రాంతమయ్యే దేవాదాయ భూముల్ని పరిరక్షించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దేవాదాయ కమిషనర్ కు లేఖ రాశారు. "అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి భీమేశ్వరస్వామి, వేణుగోపాల స్వామి భూముల్ని దోచుకునేందుకు యత్నిస్తున్నారు. వెలివర్తిపాడులో 272 సర్వే నెంబర్ లో 15.07 ఎకరాలు, 294 సర్వే నంబర్ లో 5.64 ఎకరాలు, యల్లయపాడులో సర్వే నంబరు 4 లో 4.83 ఎకరాలు భూముల్ని జిల్లా సంయుక్త కలెక్టర్ సాయంతో దోపిడీ చేసేందుకు పావులు కదుపుతున్న మంత్రి చర్యలను అడ్డుకోవాలి. మంత్రి సేవలో తరిస్తున్న అధికారుల్ని కట్టడి చేయాలి. నిషేధిత జాబితాలో 1942నుంచి ఉన్న భూముల్ని అన్యాక్రాంతం ఎలా చేస్తారు. అధికారుల్ని సైతం జైలుకు తీసుకెళ్లే అలవాటు ఈ ప్రభుత్వ పెద్దలకు ఉంది. వెంటనే ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని భూములు మంత్రి చేతిలో పడకుండా కాపాడాలి" అని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.

దేవుడి భూమి కాజేసేందుకు యత్నం..

కృష్ణా జిల్లా గుడివాడ శివారు పులివర్తి, యల్లయ్యపాలెం గ్రామాల పరిధిలో రూ.250కోట్లు విలువ చేసే 25ఎకరాల దేవాదాయ భూమిని కాజేసేందుకు మంత్రి కొడాలి నాని యత్నిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ "దేవుడి కోసం కొందరు దాతలు 50ఏళ్ల క్రితం ఆ భూమిని దానంగా ఇచ్చారు. అది దేవాదాయ భూమి కాదని ఎన్ఓసీ ఇవ్వాలని మంత్రి కొడాలి నాని అధికారుల్ని బెదిరిస్తున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఆ భూమిని కాపాడేందుకు నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. మంత్రికి భయపడి అధికారులు తప్పుచేస్తే జైలుకెళ్లక తప్పదు" అని పిల్లి మాణిక్యరావు హెచ్చరించారు.

దేవుడి భూములు కాజేయడానికే..

మంత్రి పదవి పోయేలోపు ఇల్లు చక్కబెట్టుకోవాలనే విధంగా కొడాలి నాని తీరుందని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. రూ.250 కోట్ల విలువైన దేవుడి భూములు కాజేయడానికి మంత్రి కొడాలి నాని, కృష్ణా జిల్లా ఉన్నతాధికారి ప్రణాళికలు రచించారని ఆరోపించారు. వైకాపా మంత్రుల భూతులు సరిహద్దులు దాటుతున్నాయని దుయ్యబట్టారు. డ్రగ్స్ కేసు నుంచి బయటపడేందుకు ఏపీలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇళ్లకు సంబంధించిన పెండిగ్ బిల్లులతో పాటు నీరు చెట్టు పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని ఉమా డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : JANASENA: పవన్‌ను ధైర్యంగా ఎదుర్కోలేకే వ్యక్తిగత విమర్శలు: నాదెండ్ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.