తెదేపా కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 16వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం కోసం నూతన సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు.
తెలుగువాడు ప్రధాని కావాలని నంద్యాల పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో పీవీపై తెదేపా తరఫున ఎన్టీఆర్ అభ్యర్థిని పోటీకి పెట్టలేదని నేతలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు కొమ్మారెడ్డి పట్టాభి, గురజాల మాల్యాద్రి, ఏవీ రమణ, సయ్యద్ రఫీ, దారపనేని నరేంద్ర, వల్లూరి కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :