ETV Bharat / state

కొల్లు రవీంద్ర అరెస్టు అక్రమం.. తప్పుడు సాక్ష్యాలతో కేసు

మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు కావాలనే హత్యకేసులో ఇరికించారని తెదేపా నేతలు ఆరోపించారు. తప్పుడు సాక్ష్యాలతో అరెస్టు చేశారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం తెదేపా బీసీ బలగాన్ని చూసి ఓర్వలేక... బీసీ నేతలపై దాడులు చేయిస్తుందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వంలో బడుగు , బలహీన వర్గాలు జీవించే హక్కును కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కొల్లు రవీంద్ర అరెస్టు అక్రమమం..  తప్పుడు సాక్ష్యాలతో కేసు

author img

By

Published : Jul 4, 2020, 8:12 PM IST

Updated : Jul 5, 2020, 10:21 AM IST

పోలీసులు ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కేసులో ఇరికించాలనుకున్నాక ఎన్ని తప్పుడు సాక్ష్యాలైనా సృష్టించగలరని మాజీ మంత్రి నక్కాఆనంద్‌బాబు విమర్శించారు. చనిపోయిన భాస్కరరావు కూడా ఒక రౌడీ షీటర్ అని పేర్కొన్నారు. కొల్లు రవీంద్ర అజాత శత్రువన్న ఆయన... సౌమ్యుడైన నేతను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపటం తగదని హితవుపలికారు. బలహీన వర్గాలు, దళితులు జగన్ ప్రభుత్వంలో జీవించే హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని నక్కాఆనంద్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలను లక్ష్యంగా చేసుకున్నారు : చినరాజప్ప

నిందితులతో బలవంతంగా పోలీసులే కొల్లు రవీంద్ర పేరు చెప్పించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. కేసు పెట్టాలనుకున్నప్పుడు... ఎలాగైనా పోలీసులు పెట్టగలరన్నారు. బీసీల మద్దతు తెలుగుదేశానికి ఎక్కువగా ఉన్నందుకే వారిని సీఎం లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. సభాపతి కూడా రాజ్యాంగంపై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి వైఖరికి తగ్గట్లే కార్యకర్తలు, పార్టీ నేతలు ఉన్నారని చినరాజప్ప విమర్శించారు.

సంకెళ్లతో నిరసన

మాజీమంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ విజయవాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెదేపా బీసీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేతులకు సంకెళ్లు వేసుకుని, బీసీ నాయకులపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులను నిలిపివేయాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

ఇదీ చదవండి : ఒకే రాజధాని... ఒకే డిమాండ్

Last Updated : Jul 5, 2020, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.