ETV Bharat / state

'కుమారుడి తప్పులను కప్పిపుచ్చేందుకే.. విజయమ్మ ఆరాటం' - తెదేపా అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ తాజా వ్యాఖ్యలు

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణపై.. సీఎం జగన్​ తీరును తెదేపా నేతలు దుయ్యబట్టారు. విచార‌ణ‌కు సీబీఐ వ‌స్తే.. దిల్లీని గ‌డ‌గ‌డ‌లాడిస్తాన‌న్న జ‌గ‌న్.. ఇప్పుడు తానే గ‌జ‌గజ వ‌ణుకుతున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్​ను విజయమ్మ నిలదీయాలని ఎమ్మెల్సీ మంతెన డిమాండ్ చేశారు.

tdp leaders fire
తెదేపా నేత నారా లోకేష్
author img

By

Published : Apr 6, 2021, 6:43 PM IST

"బాబాయ్ ని ఎవరు చంపారో అబ్బాయి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. చిన్నానని చంద్రబాబు న‌రికేశాడ‌న్న జగన్‌.. సీబీఐ ద‌ర్యాప్తును ఇప్పుడెందుకు వ‌ద్దంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. వివేకానంద‌రెడ్డి హ‌త్యకేసు విచార‌ణ‌కు సీబీఐ వ‌స్తే.. దిల్లీని గ‌డ‌గ‌డ‌లాడిస్తాన‌న్న జ‌గ‌న్.. ఇప్పుడు తానే వ‌ణుకుతున్నారని ఎద్దేవా చేశారు.

విజయమ్మ.. ముందుగా జగన్​ను నిలదీయాలి: ఎమ్మెల్సీ మంతెన

"వివేకా హత్య కేసులో నిందితుల్ని కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డిని విజయమ్మ నిలదీయాలి" అని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు డిమాండ్ చేశారు. "విజయమ్మ బహిరంగ లేఖ ఆరాటం.. కుమారుడు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే" అని చెప్పారు. రెండేళ్లుగా తండ్రిని చంపిన నిందితుల్ని శిక్షించాలని సునీతారెడ్డి చేస్తున్న ఆందోళన కనిపించట్లేదా అని ప్రశ్నించారు.

'సీబీఐ విచారణ ఎందుకు వద్దంటున్నారు?'

వేగంగా జరుగుతున్న సిట్ విచారణను ప్రభుత్వం అడ్డుకుంటోందని తెదేపా అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ ఆరోపించారు. నాడు సీబీఐ విచారణ కావాలని కోరిన వాళ్లే.. ఇప్పుడు ముందుకు కదలనివ్వటం లేదని.. ఇలా ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

ఇవీ చూడండి:

జస్టిస్ ఎన్వీ రమణ ఎంపిక మాకు ఎంతో గర్వకారణం: బెజవాడ బార్ అసోసియేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.