తడిచిన ధాన్యం కళ్లాల్లో మగ్గిపోతుంటే, ముఖ్యమంత్రికి, వ్యవసాయమంత్రికి కనిపించడం లేదా అని మాజీ మంత్రి దేవినేని ఉమ ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్ల ముసుగులో వైకాపా నేతలు, దళారులు, మిల్లర్లతో కలిసి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరని మండిపడ్డారు. రెండేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం సాగునీటి రంగానికి ఎంత ఖర్చు చేసిందో, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను రైతునని గర్వంగా చెప్పుకోలేని ధీనస్థితిలోకి రైతులను సీఎం జగన్ రెడ్డి దిగజార్చారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. ఉచిత పంటల బీమా పేరుతో గోరంత ఇచ్చి.. కొండంత ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. గతేడాది ఖరీఫ్ లో 7 తుఫాన్లతో 37 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి రూ.15 వేల కోట్లు నష్టపోతే... జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం రూ.1820.23 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: