వైకాపా పాలనలో ప్రజలపై పన్నుల మోత పడిందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. పన్నులు, ఛార్జీల పెంపుతో 70 వేల కోట్ల రూపాయల భారం మోపినట్లు తెలిపారు. పట్టణ భూముల విలువ పెంపుతో ప్రజలపై 8 వందల కోట్ల భారం పడుతుందన్న యనమల.. ఆస్తి పన్ను 15 శాతం పెంపుతో 8వేల కోట్ల రూపాయల భారం మోపుతున్నారన్నారు. విద్యుత్ బిల్లులు పెంచి 3 వేల కోట్ల రూపాయల భారం మోపారని విమర్శించారు. నిత్యావసరాల ధరలు 200 శాతం నుంచి 300 శాతానికి పెంచేశారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రైతుల రెక్కల కష్టం నీళ్ల పాలు