వైకాపా ప్రభుత్వంపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, సభ్యులపై దాడులు జరుపుతున్నారన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ప్రజల సమస్యలపై పోస్టులు పెట్టిన వారిని అరెస్టులు చేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు.
మొన్న నందిగామ కృష్ణ, నిన్న నలంద కిశోర్‌లు ఏం తప్పు చేస్తే అరెస్ట్ చేశారని పోలీసులను నిలదీశారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు.. వైకాపా కార్యకర్తలు, నేతలు ఫిర్యాదులు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. నలంద కిశోర్ ఫార్వార్డ్ చేసిన పోస్ట్ విశాఖలో ఎప్పట్నుంచో ఉందన్నారు. అక్కడి ప్రజలందరికీ దాని గురించి తెలుసునని వ్యాఖ్యానించారు. ఆ పోస్టులో ఉన్నది నిజమా! అబద్ధమా అంటూ పోలీసుల్ని నిలదీశారు.
ఇవీ చదవండి...
'వీడియో ఫుటేజీలు బయటపెట్టండి.. మా తప్పుంటే రాజీనామా చేస్తాం'