ETV Bharat / state

'బీసీల రిజర్వేషన్లు పరిరక్షించడానికి ఇంకా అవకాశముంది' - బీసీ రిజర్వేషన్లు

ముఖ్యమంత్రి జగన్ బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించడానికి ఇప్పటికీ అవకాశం ఉందన్నారు.

tdp leader kalva
tdp leader kalva
author img

By

Published : May 21, 2020, 7:59 AM IST

బీసీలను సీఎం జగన్ ఓటు బ్యాంకుగానే చూస్తూ .. రిజర్వేషన్ల విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. 34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించడానికి ఇప్పటికీ అవకాశం ఉందన్నారు. సత్వరం కొత్త ఆర్డినెన్స్ విడుదల చేయాలన్నారు. ఎవరైనా కోర్టుకు వెళితే మంచి లాయర్లను పెట్టి బలమైన వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు.

వచ్చే రెండు, మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అవకాశం లేనందున ప్రభుత్వానికి కలిగిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. బీసీ ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై ఆలోచన చేయాలని.. ఐక్య పోరాటాలకు ముందుకు రావాలని కాల్వ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్​ ట్రైబ్యునల్​ స్టే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.