ETV Bharat / state

'ప్రభుత్వం మెడలు వంచైనా రాజధానిని కాపాడుకుంటాం'

రాజధాని అమరావతిపై జీఎన్​ రావు కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది జగన్​ కమిటీ అని ఎద్దేవా చేశారు. మంత్రులు సీఆర్డీఏపై అవగాహనతో మాట్లాడాలని సూచించారు. ప్రజల కోసం న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

'ప్రభుత్వం మెడలు వంచైనా రాజధానిని కాపాడుకుంటాం'
'ప్రభుత్వం మెడలు వంచైనా రాజధానిని కాపాడుకుంటాం'
author img

By

Published : Dec 21, 2019, 2:51 PM IST

సీఎం జగన్​ ప్రజల గుండెలపై తన్నారని దేవినేని విమర్శ
రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే రాజధాని అమరావతిని కాపాడుకుంటామని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాజధానిపై నివేదిక ఇచ్చిన జీఎన్​ఆర్​ కమిటీ సభ్యులు రైతుల ఆగ్రహం చూసి దొడ్డిదారిన పారిపోయారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్​ తన పుట్టినరోజు సందర్భంగా ఐదు కోట్ల ప్రజల గుండెలపై తన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు సీఆర్డీఏపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చట్టాల గురించి అమాత్యులు తెలుసుకోవాలని సూచించారు. 29 గ్రామాల ప్రజలు రోడ్ల మీద ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వచ్చే వారం నుంచి ఓ వైపు న్యాయ పోరాటం.. మరోవైపు ధర్మపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

'జీఎన్‌రావు కమిటీ కాదిది... వైఎస్​ జగన్ కమిటీ'

Intro:AP_VJA_25_21_DEVINENI_UMA_PRESS_MEET_737_AP10051

రాజధానిపై నివేదిక ఇచ్చిన జిఎన్ఆర్ కమిటీ సభ్యులు రైతుల ఆగ్రహం చూసి దొడ్డిదారిలో పారిపోయారని, జిఎన్ఆర్ అనే వ్యక్తి గతంలో డిఆర్డిఏ పిడి గా ఏమి వెలగ పెట్టాడో అందరికీ తెలుసని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఐదు కోట్ల మంది ప్రజల గుండెల పై తన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 గ్రామాల ప్రజలు రోడ్లమీద ఆందోళనలు చేస్తుంటే, ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారని, ఆ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు సిగ్గుపడా లన్నారు. సిఆర్డిఏ లాంటి బలమైన చట్టం తో ప్రభుత్వం మెడలు వంచి రాజధానిని కాపాడుకుంటాం అన్నారు. వచ్చే వారం నుంచి ఒకవైపు న్యాయపోరాటం మరోవైపు ధర్మ పోరాటం చేసి అమరావతిని కాపాడుకుంటామని ముఖ్యమంత్రి కి సవాల్ చేశారు.

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648

Body:ప్రభుత్వం మెడలు వంచి రాజధానిని కాపాడుకుంటాం

Conclusion:ప్రభుత్వం మెడలు వంచి రాజధానిని కాపాడుకుంటాం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.