రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ మీదే ఇంటెలిజన్స్ నిఘా నడుస్తోందనే చర్చ.. పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. గౌతం సవాంగ్ డీజీపీగా కంటే.. సీఎం జగన్కు అనుకూలంగానే పని చేశారని ఆరోపించారు.
ఓ సీఐని కూడా బదిలీ చేయలేని స్థితిలో డీజీపీ ఉన్నారని ఎద్దేవా చేశారు. గౌతం సవాంగ్ ఏ పరిస్థితుల్లో ఉన్నా సీఎం జగన్ మెప్పు కోసం తెదేపా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
JAGAN CASE: మరోసారి గడువు కోరిన సీబీఐ.. 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్‌పై విచారణ వాయిదా