సీఎం గారు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి: అశోక్ బాబు - tdp leader ashok babu letter to cm jagan
రోజు రోజుకూ విజృంభిస్తున్న కరోనాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు సీఎం జగన్ను కోరారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు.
ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడకుండా వారికి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేసారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులపై ఉద్యోగులకు వైద్యం కూడా అందట్లేదంటూ సీఎంకు లేఖ రాశారు.
"ఉద్యోగులకు పనిచేసే చోట మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు ఇవ్వాలి. ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు కేటాయించాలి. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలి. పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేసి ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ప్రాణాలు కాపాడాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. రాష్ట్రంలో కరోనా రెండో దశ ఉద్ధృతంగా కొనసాగుతుంటే.. ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవడం లేదు." - తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు
ఇవీ చదవండి:
'ఈసీ అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలి'
రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కింద ఎక్కడ చికిత్స అందుతోంది: సోమిరెడ్డి