ETV Bharat / state

న్యాయస్థానాన్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది: ఆలపాటి - ఉపాధిహామి బిల్లులు తాజా వార్తలు

ఉపాధి హామీ పనుల చెల్లింపులో న్యాయస్థానాన్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని తెదేపా నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. ఇప్పటికీ కొన్నిచోట్ల పనులకు బిల్లులు చెల్లించలేదని ఆయన ఆరోపించారు. బిల్లుల చెల్లంపుల విషయంలో ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని అన్నారు.

tdp leader alapati raja on mgnrega
ఉపాధిహామి బిల్లులపై ఆలపాటి
author img

By

Published : Mar 31, 2021, 3:48 PM IST

నరేగా బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తోందని మాజీమంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన రూ.2 వేల 460 కోట్ల నిధుల్లో పెండింగ్ బిల్లులు ముందుగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినా.. ఇప్పటికీ చెల్లించండం లేదని అన్నారు. సోషల్ ఆడిట్ జరిగిన పనుల్లో మళ్లీ విజులెన్సు విచారణ చెల్లుబాటు కాదని.. బిల్లుల చెల్లింపుల తీరుపై కోర్టు తప్పుబట్టినా ప్రభుత్వం తీరు మారడం లేదని అన్నారు.

కేంద్రం విడుదల చేసిన రూ.4వేల కోట్ల నిధులను, ఇళ్ల స్థలాల చదును కోసం వినియోగించామని ప్రభుత్వం చెప్పింది. ఆ పనికి రూ.500 కోట్లు కూడా ఖర్చుచేయలేదని ఆరోపించారు. అధికారులను ప్రలోభపెట్టి, సంతకాలు పెట్టించుకుని వైకాపా నేతలే నిధులు కాజేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన పనుల నిధులతో పాటు, కేంద్రం ఇచ్చిన రూ.6 వేల 400 కోట్లను ఎక్కడ, ఏ రూపంలో ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

వీడియో కాల్స్ కదా అని ఎత్తారో.. ఇక అంతే సంగతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.