TDP CHIEF CBN VISIT GANNAVARAM PARTY OFFICE : గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు సాగించిన విధ్వంసకాండను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు స్వయంగా పరిశీలించనున్నారు. రాజ్భవన్లో నూతన గవర్నర్గా విశాంత్ర న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం అనంతరం గన్నవరం వెళ్లనున్నారు. ఈ నెల 20వ తేదీన గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు ధ్వంసం చేసి వాహనాలకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడంతో న్యాయస్థానం 11 మందికి రిమాండ్ విధించింది. టీడీపీ లీడర్ పట్టాభిని రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు. ఘటనలో జైలులో ఉన్న వారి కుటుంబసభ్యులను నేడు చంద్రబాబు పరామర్శించనున్నారు.
ప్రసాదంపాడులో రామినేని రమేష్ నివాసానికి వెళ్లనున్న చంద్రబాబు.. అనంతరం గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్‌లోని దొంతు చిన్నా నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ధ్వంసమైన గన్నవరం పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు సందర్శిస్తారు. ఈ నెల 21వ తేదీనే చంద్రబాబు గన్నవరం వెళ్లాలని భావించగా ఎయిర్‌పోర్టు వద్దే పోలీసులు రహదారికి లారీలను అడ్డుగా పెట్టి అడ్డంకులు సృష్టించారు. 144 సెక్షన్, 50 పోలీస్యాక్ట్ను సాకుగా చూపుతున్న ప్రభుత్వం నేటి చంద్రబాబు పర్యటన పట్ల ఎలా వ్యవహరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.
అనంతరం పార్టీ పరిస్థితిపై జోన్ల వారీ సమీక్షలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఏలూరు జోన్ పరధిలోని 5 పార్లమెంట్ స్థానాల నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. అటు.. గన్నవరం ఘటనపై ఎస్పీ జాషువా చెప్పినవన్నీ అవాస్తవాలని.. టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. సజ్జల డైరెక్షన్‌లోనే ఎస్పీ అవాస్తవాలను మీడియాకు వల్లె వేశారని చెప్పారు.
"ఎస్పీ జాషువా పాత్రికేయులకు చెప్పినవన్నీ అబద్ధాల పుట్ట. మొన్న గన్నవరంలో జరిగిన మారణ హోమం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిసమ్. ఈ ఘటనలో బాధితులే ముద్దాయిలు అయ్యారు. ఎమ్మెల్యే వంశీ రెక్కీ నిర్వహించడం నిజం కాదా. దాడి చేస్తున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారా? పట్టాభి విసిరిన రాయి మాత్రమే సీఐకి తగిలిందా"-వర్ల రామయ్య, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు
ఇవీ చదవండి: