ETV Bharat / state

వంగవీటి మోహనరంగా 34వ వర్ధంతి.. నివాళులు అర్పించిన పలువురు నాయకులు - వంగవీటి రంగా తాజా వార్తలు

VANGAVEETI RANGA: వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా పలువురు నాయకులు నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా సేవలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని వ్యాఖ్యానించారు.

VANGAVEETI RANGA
VANGAVEETI RANGA
author img

By

Published : Dec 26, 2022, 12:59 PM IST

VANGAVEETI RANGA DEATH ANNIVERSARY : వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా పలువురు నాయకుల నివాళులర్పించారు. రంగా విగ్రహానికి ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ, టీడీపీ నేత బోడే ప్రసాద్, జనసేన పోతిన వెంకట మహేష్​లు పూల మాల వేసి నివాళులర్పించారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా రంగా ప్రజల గుండెల్లో నిలిచారని ఆయన కుమారుడు రాధా తెలిపారు. పేదల పెన్నిధి అయిన రంగాను 34 ఏళ్లుగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు.

వంగవీటి మోహనరంగా 34వ వర్ధంతి.. నివాళులు అర్పించిన పలువురు నాయకులు

కోట్ల మంది అభిమానం రంగాకే సొంతం: వంగవీటి మోహనరంగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి అని.. కోట్ల మంది ప్రజల అభిమానం ఆయనకే సొంతమని టీడీపీ నేత బోడే ప్రసాద్ అన్నారు. కొంతమంది వారి పార్టీ కోసం రాధాను వాడుకుని వదిలేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ రాజకీయ ప్రయోజనం కోసం ఆరాట పడుతున్నారని విమర్శించారు. ప్రజలు వంగవీటి రాధాకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

రంగా స్ఫూర్తితో గుడివాడలో రౌడీయిజాన్ని అంతమొందిస్తాం: గుడివాడలోని ఏజీకే స్కూల్ వద్ద వంగవీటి రంగా విగ్రహానికి టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు, పార్టీ శ్రేణులు, జనసేన నేతలు నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొడాలి నాని గుడివాడలో 5వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని రావి వెంకటేశ్వరరావు విమర్శించారు. 20 ఏళ్ల నుంచి గుడివాడలో రంగా వర్ధంతి కార్యక్రమం జరుగుతోందని.. ఆయన స్ఫూర్తితో గుడివాడలో రౌడీయిజాన్ని అంతమొందిస్తామని తెలిపారు. కొడాలి నానిని గుడివాడ నుంచి తరిమి కొడతామన్నారు. రాత్రి గుడివాడలో పెట్రోల్ బాంబు విసిరింది కొడాలి నాని సొంత మనుషులే అని ఆరోపించారు. మరోసారి తెలుగుదేశం శ్రేణుల జోలి కొస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. పోలీసులు వైసీపీకి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ప్రజాదరణ కలిగిన మహోన్నత వ్యక్తి: గుడివాడలో వంగవీటి రంగా విగ్రహానికి టీడీపీ నేత వెనిగండ్ల రాము, పార్టీ శ్రేణులు, కాపు నేతలు నివాళులర్పించారు. వంగవీటి మోహనరంగా అందరివాడని.. చనిపోయి 34 సంవత్సరాల తర్వాత కూడా, ఇంతలా ప్రజాదరణ కలిగి ఉన్న మహోన్నత వ్యక్తి అని వెనిగండ్ల రాము కొనియాడారు. గుడివాడలో సెక్షన్ 144, 30యాక్ట్ అమలు రంగా వర్ధంతిని అడ్డుకునేందుకే అని మండిపడ్డారు. నిన్న గుడివాడలో జరిగిన ఘటనలు అమానుషమన్నారు.

మాట ఇస్తే ప్రాణం పోయే వరకు పోరాడే వ్యక్తి: మాట ఇస్తే ప్రాణం పోయే వరకు పొరాడే వ్యక్తి వంగవీటి మోహనరంగా అని జనసేన నేత పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు. రంగాను పొగుడుతూ.. ఆయన బిడ్డకు అన్యాయం చేస్తారని.. రాధాకు చేసిన అన్యాయాన్ని అభిమానులు ఎవరూ మరచి పోలేదన్నారు. కొత్త జిల్లాకు రంగా పేరు పెట్టాలని‌ కోరినా.. జగన్ స్పందించ లేదని మండిపడ్డారు. రంగా పేరు చెప్పుకునే వైసీపీ నేతలు కనీసం స్మృతీ వనం కూడా ఏర్పాటు చేయలేదన్నారు.

పులివెందుల ఫ్యాక్షన్​ను కొడాలి నాని గుడివాడకు పరిచయం చేశారని జనసేన నేత బూరగడ్డ శ్రీకాంత్ మండిపడ్డారు. గుడివాడలో రంగా వర్థంతి వద్దంటూ వైసీపీ పెట్రోల్ దాడికి దిగటాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాజకీయ అవసరాల కోసం రాధాతో కొడాలి నాని స్నేహం నటిస్తున్నాడని విమర్శించారు. కాపులంతా కొడాలి నానిని గుడివాడలో ఓడించి తీరుతారన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.