ETV Bharat / state

సభలో సమరం: నల్ల చొక్కాలతో హాజరవ్వాలని తెదేపా నిర్ణయం

మంగళవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు నల్ల చొక్కాలు ధరించి హాజరుకావాలని తెదేపా శాసనసభాపక్షం నిర్ణయించింది. పార్టీ నేతలపై దాడులు, అక్రమ అరెస్టులమీద నిరసన తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు.

chandra babu
chandra babu
author img

By

Published : Jun 15, 2020, 3:08 PM IST

నల్ల చొక్కాలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని తెదేపా శాసనసభాపక్షం నిర్ణయించింది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన తెదేపా శాసనసభాపక్ష సమావేశం ఆన్‌లైన్‌లో దాదాపు 4 గంటల పాటు సాగింది. అసెంబ్లీకి వెళ్లవద్దని పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు సూచించారు.

వెళ్లకపోతే మండలిలో కొన్ని బిల్లులు ఆమోదించుకునే ప్రమాదం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. అవసరం అయితే పరిస్థితిని బట్టి వాక్ ఔట్ చేయవచ్చనే ఏకాభిప్రాయానికి వచ్చారు. తెదేపా నేతలపై దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా అసెంబ్లీ జరిగినన్ని రోజులు నల్ల చొక్కాలతో వెళ్లాలని సమావేంలో నిర్ణయించారు.

ఇదీ చదవండి:

తెదేపా ఎమ్మెల్యే పై వైకాపా వర్గీయుల రాళ్లదాడి...కార్యకర్తలకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.