ETV Bharat / state

వినూత్న ఆలోచనలతో శభాష్‌ అనిపించుకుంటున్న విద్యార్థులు

ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఏ మాత్రం తీసిపోకుండా గట్టి పోటీనిస్తూ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు ఈ విద్యార్థులు. కృష్ణా జిల్లా తలగడదీవి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైన్స్ కాంగ్రెస్​కు ఎంపికయ్యారు. తమ విద్యార్థులు ఇలా రాష్ట్ర స్థాయిలో రాణించడం ఇది మూడోసారి అని ఉపాధ్యాయులు తెలిపారు.

author img

By

Published : Nov 9, 2019, 10:02 AM IST

బహుమతులతో విద్యార్థులు
రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

కృష్ణాజిల్లా నాగాయలంక మండలం తలగడదీవి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులు రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్ర స్థాయి సైన్స్ కాంగ్రెస్​కు ఎంపికైంది. ఈ నెల 2న విజయవాడలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో 9వ తరగతి చదువుతున్న బండిరెడ్డి యశశ్రీ, మాధవి, కొరివి సునందిని, సువర్ణ రూపొందించిన ''మట్టి లేకుండా వ్యవసాయం '' ప్రాజెక్ట్​లో సత్తా చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో అన్ని పాఠశాల నుంచి సుమారు 316 ప్రాజెక్ట్​లు రాగా... వీరు చేసిన ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయిలో ఎంపికైంది. ఇదే బడిలో 9వ తరగతి చదువుతున్న బండిరెడ్డి ఇందుజ, బర్మా నాగ పూజిత చేసిన '' ఎరువుల కాలుష్యానికి సహజ పరిష్కారం '' ప్రాజెక్ట్​కు జిల్లా స్థాయిలో బహుమతి లభించింది.
వివిధ రంగాల్లో రాణిస్తూ...
మూడేళ్లుగా తమ పాఠశాల విద్యార్థులు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్​కు ఎంపికై... రాష్ట్ర స్థాయిలోనూ అవార్డులు సాధించినట్లు ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్ తెలిపారు. గత నెలలో జపాన్​లో జరిగిన ప్రపంచ సునామీ సదస్సులోనూ విద్యార్ధులు పాల్గొని సత్తా చాటారన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి: పసిడి గెలుచుకున్న 'అటానమస్ కారు'

Intro:ap_vja_64_08_Talagadadevi_govt_school_students_select_statelevel_science_congress_selections_avb_pkg_ap10044.

కిట్ 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511.

కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం, తలగడదీవి గ్రామంలోని  ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్ధులు రూపొందించిన ప్రాజెక్ట్  రాష్ట్ర స్థాయి సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికయినదని ఉపాధ్యాయులు తెలిపారు. 

  ఈ నెల 2 న విజయవాడలోని  ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో  జరిగిన జిల్లా స్థాయి పోటిలలో 9 వ తరగతి చదువుతున్న బండిరెడ్డి యశశ్రీమాధవి, కొరివి సునందిని సువర్ణ  రూపొందించిన  ''మట్టి లేకుండా వ్యవసాయం ''  ప్రాజెక్ట్ లో సత్తా చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. కృష్ణా జిల్లా స్థాయిలో  అన్ని పాఠశాల నుండి సుమారు  316 ప్రాజెక్ట్ లు రాగా వీరు చేసిన ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయిలో ఎంపిక కాబడినది. 
ఇదే స్కూల్ నందు  9 వ తరగతి చదువుతున్న బండిరెడ్డి  ఇందుజ,  బర్మా నాగ పూజిత ప్రాజెక్ట్ అయిన '' ఎరువుల కాలుష్యానికి సహజ పరిష్కారం ''  డివిజన్ స్థాయిలో విజేతగా నిలచి  జిల్లా స్థాయిలో బహుమతి సాధించారు. 

 2017, 2018 మరియు 2019 లలో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కు   రాష్ట్ర స్థాయిలో కూడా అనేక అవార్డులు సాధించినట్లు తెలిపారు. 
ఈ పాఠశాల  విద్యార్ధులకు టీచింగ్ చెప్పిన  సైన్స్ టీచర్  కొమ్మినేని ఉదయ కుమార్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ని  విద్యార్ధుల తల్లి తండ్రులు అభినందించారు.
 గత నెలలో భారతదేశం నుండి జపాన్ దేశానికి వెళ్లి విద్యార్ధుల స్థాయిలో జరిగిన  ప్రపంచ  సునామీ సదస్సులో పాల్గొని ఈ స్కూల్  విద్యార్ధులు సత్తా చాటారు. 

 వాయిస్ బైట్స్ 
కొమ్మినేని ఉదయ కుమార్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ
ఉపాధ్యాయుడు
 విద్యార్ధులు 
 
Body:
రాష్ట్రస్థాయి బాలల సైన్స్ పోటీలకు ఎంపికైన తలగడదీవి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

Conclusion:రాష్ట్రస్థాయి బాలల సైన్స్ పోటీలకు ఎంపికైన తలగడదీవి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.