స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన కరోనా థీమ్ శకటాలు, ఇతర శాఖల శకటాలను ప్రజలు కూడా చూసేందుకు వీధుల్లోకి వచ్చాయి. విజయవాడ, గుంటూరు, తెనాలి నగరాల్లో శకటాలను ప్రదర్శించాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం నిర్ణయించటంతో... శకటాలు రోడ్ల మీదకు వచ్చాయి. వీటిని సీఎంఓ కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కరోనాపై ప్రజల్లో మరింత అవగాహన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ శకటాలను.. ప్రజలు సైతం ప్రత్యక్షంగా చూసేందుకు అవకాశం కల్పించేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: వరద ప్రవాహం.. గ్రామస్థుల సహాయం.. ప్రభుత్వ సిబ్బందికి తప్పిన ప్రమాదం