కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందారు. చెన్నై-కోల్కతా జాతీయ రహదారి పక్కన పీ.ఎమ్.జీ కంపెనీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్పై వేలాడుతున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దింపి వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: అవినీతి చేయకూడదనే సినిమాల్లో నటిస్తున్నా : పవర్ స్టార్