ETV Bharat / state

కుమారుడిని హత్య చేయించిన తల్లిదండ్రులు..కారణాలు ఏమిటో తెలుసా ? - కుమారుడిని హత్య చేయించిన తల్లిదండ్రులు

Parents who murdered their son: కన్న పేగును ఎవరు తెంచుకోవాలని చూస్తారు చెప్పండి.. పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని ఏ తల్లిదండ్రులైన అనుకోవడం సహజం. అదే కుమారుడు పుడితే పండగలాగా చేసుకుంటారు. ఎందుకంటే తమ ఇంటికి వంశోద్దారకుడు పుట్టాడు అని, అయితే వాడు పుట్టిన పెద్దయైన తరవాత తెలుస్తోంది వాడు తల్లిదండ్రులను రక్షిస్తాడా లేక పీడిస్తాడా అని.. అయితే తెలంగాణ సూర్యాపేట జిల్లాలో తల్లిదండ్రులు కుమారుడిని వధించిన ఘటన చోటుచేసుకుంది. అందేంటి అనుకుంటున్నారా ఇదే నిజం... ఎవరైనా ఎంత వరకు ఓదార్పుగా ఉంటారు చెప్పండి. అందుకే కొడుకును కడతేర్చారు. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి మరీ?

కుమారుడిని హత్య చేయించిన తల్లిదండ్రులు
కుమారుడిని హత్య చేయించిన తల్లిదండ్రులు
author img

By

Published : Nov 1, 2022, 1:09 PM IST

Parents who murdered their son: కుమారుడి వికృత చేష్టలు భరించలేక తల్లిదండ్రులు తమ కుమారుడినే హత్య చేయించారు. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. ఇలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒకటే అని భావించి యువకుడి మేనమామ ద్వారా సుఫారీ ఇచ్చి హత్య చేయించారు. హత్య చేసి గుట్టు చప్పుడు కాకుండా మూసీనదిలో పడేశారు. ఈ గుర్తు తెలియని శవాన్ని పోలీసులు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపహాడ్​ వద్ద అక్టోబర్​ 19న మూసీనదిలో గుర్తించారు. అయితే పోలీసులు గుర్తు తెలియని శవం లభ్యమైన కేసుగా నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఆసక్తి కరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన క్షత్రియ రామ్​సింగ్​, రాణిబాయి దంపతులకు సాయినాథ్(26)​ కుమారుడు, కుమార్తె సంతానంగా కలరు. రామ్​సింగ్​ సత్తునపల్లిలోని ఓ రెసిడెన్షియల్​ కళాశాలలో ప్రిన్సిపల్​గా ఉద్యోగం చేస్తున్నారు. ఇతని కుమారుడు సాయినాథ్​ చదువును మధ్యలోనే ఆపేసి.. వ్యసనాలకు బానిసయ్యాడు. నిరంతరం డబ్బుల గురించి తల్లిదండ్రులను వేధించేవాడు. అంతటితో ఆగకుండా తల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. కొడుకు వికృత చేష్టలను నాలుగేళ్లు భరించిన తల్లిదండ్రులు ఇంక భరించలేక చంపాలని నిర్ణయించుకున్నారు.

ఇందుకు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నివాసం ఉంటున్న సాయినాథ్​ మేనమామ సత్యనారాయణ సింగ్​కు ఈ విషయం చెప్పగా హత్యకు పన్నాగం పన్నారు. అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్​​ రవిని ఆశ్రయించాడు. ఈ హత్య చేయడానికి రూ. 8 లక్షలు అవుతాయని మరికొందరితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. నల్గొండ జిల్లాలో కల్లేపల్లిలోని మైసమ్మ దేవాలయం వద్దకు దావత్​కు చేసుకుందామని అక్టోబర్​ 18న సాయినాథ్​ను మేనమామ​, రవి కలిసి తీసుకువెళ్లారు. అందరూ కలిసి మద్యం తాగిన అనంతరం సాయినాథ్​ పూర్తిగా నిషలోకి జారుకున్నాక మెడకు తాడు బిగించి చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని మూసీ నదిలో పడేశారు. మరుసటి రోజు నదిలో శవం తేలడంతో గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేశామని హుజూర్​నగర్​ సీఐ రామలింగారెడ్డి తెలిపారు.

మూడు రోజులు తరవాత మీడియా ద్వారా విషయం తెలుసుకొని తల్లిదండ్రులు వచ్చి శవాన్ని తీసుకెళ్లారని సీఐ పేర్కొన్నారు. సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించిన అనంతరం హత్య రోజు కనిపించిన కారు మృతుడి తల్లిదండ్రులు తీసుకొచ్చిన కారు ఒకటేనని నిర్ధరించామన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తామే చంపించినట్లు ఒప్పుకొన్నారన్నారు. తల్లిదండ్రులతో సహా మరో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు వినియోగించిన 4 కార్లు,1బైక్, ప్లాస్టిక్ తాడు,రూ.23,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్​ విధించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.