కృష్ణా జిల్లా బార్లపూడి చల్లపల్లి గురుకుల పాఠశాల ఉపాధ్యాయిని ఆకస్మికంగా మృతి చెందారు. రాత్రి తొమ్మిది గంటల వరకు తమతో కలిసి ఉన్న రాజ్యలక్ష్మి.. ఒక్కసారిగా కడుపునొప్పితో కుప్ప కూలిపోయిందని కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారన్నారు.
మెరుగైన వైద్యం కోసం ఉయ్యూరు తీసుకువెళ్తుండగా దారిలోనే మద్దాల రాజ్యలక్ష్మి(29) మృతి చెందినట్లు పేర్కొన్నారు. మువ్వ మండలం బార్లపూడి ఆమె స్వగ్రామం. ఘటనపై.. ఉపాధ్యాయ సంఘాల నేతలు సంతాపం తెలిపారు.
ఇవీ చూడండి: